హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగనున్న బో ర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఎస్సీ గురుకులాల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సంఘాల నాయకులు గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురుకులాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం అసోసియేషన్ క్యాలెండర్‌ను మంత్రి ఆవిషరించారు.