ఇండోర్ : గంగా నదిలో మునిగితే పేదరికం అంతమవుతుందా, ఆకలి కడుపులు నిండుతాయా అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సోమవారం మధ్యప్రదేశ్లోని మహూలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ‘నేను ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించడం లేదు. ఎవరైనా తప్పుగా భావిస్తే క్షమాపణ కోరతాను. కానీ, నాకో విషయం చెప్పండి. పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. పాఠశాలలకు వెళ్లడం లేదు. కార్మికులకు బకాయిలు అందడం లేదు. ఇలాంటి సమయంలో వేల రూపాయలు ఖర్చుపెట్టి గంగా నదిలో స్నానం కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి వారు దేశానికి మేలు చేయలేరు’ అని అన్నారు.