Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే.. తిరిగి ఎన్నికైన నేపథ్యంలో ఆ మేరకు గుర్తింపు
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా సోమవారం తిరిగి గుర్తించారు. రాజ్యసభకు మరోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరిగి నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా సోమవారం తిరిగి గుర్తించారు. రాజ్యసభకు మరోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరిగి నియమితులయ్యారు. (Mallikarjun Kharge) జూన్ 25తో రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే పదవీకాలం ముగిసింది. దీంతో జూన్ 26 నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన కొనసాగలేదు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో సోమవారం రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గేను మరోసారి గుర్తించారు.
మరోవైపు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. ‘రాజ్యసభకు తిరిగి ఎన్నికైనందున, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం జూన్ 26 నుంచి అన్ని ప్రయోజనాలు అమలులోకి వచ్చేలా మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభ చైర్మన్ గుర్తించారు’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

