న్యూఢిల్లీ: విచ్ఛిన్నమైన విపక్ష ఇండియా కూటమి నుంచి అరుదైన ఐక్యతారాగం వినిపించింది. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షం మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ప్రకటించారు.
ఇండియా కూటమి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌కు మేం వ్యతిరేకం కాదు. అయితే బిల్లులను ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది రాజకీయ ప్రేరేపితం. మేం డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తాం అని అన్నారు.