న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)పై నిషేధం విధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. దేశంలో ప్రస్తుతం దిగజారిన శాంతిభద్రతల పరిస్థితికి బీజేపీ, ఆరెస్సెస్సే కారణమని ఆరోపించిన ఆయన, ప్రధాని మోదీ నిజంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆశయాలను గౌరవిస్తుంటే వెంటనే ఆరెస్సెస్‌ను నిషేధించాలని అన్నారు.
గాంధీ మరణించిన తర్వాత ఆరెస్సెస్ ఎలా సంతోషించిందో వివరిస్తూ, ఆరెస్సెస్‌ను నిషేధించడం తప్ప మరో మార్గం లేదంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి అప్పట్లో సర్దార్ పటేల్ లేఖ రాసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు.