న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ ప్రజల ముందు కన్నీరు పెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఘాటుగా విమర్శించారు. బీదర్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ, ‘కూడు, గుడ్డ, నీడ లేని ప్రజలెందరో ఉన్న ఈ దేశంలో, ప్రధాని మోదీ ప్రతి రోజూ ఎన్నో కొత్త దుస్తులు మార్చుతారు.
పేదవాడిని అంటూ కన్నీరు పెడుతున్నారు. ఇలా కన్నీరుపెట్టడం కాదు.. ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.‘క్రై పీఎం పే సీఎం’ (ఏడ్చే ప్రధాని, అవినీతి సీఎం) హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో కాంగ్రెస్ పంపుతున్న సందేశాలు వైరల్‌గా మారాయి.