Mahila Samridhi Yojana | దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘మహిళా సమృద్ధి యోజన’ (Mahila Samridhi Yojana) పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వెల్లడించారు. ఈ పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2,500 అందించనున్నారు.
‘Mahila Samridhi Yojana’ to give Rs 2500 to women in Delhi has been approved today, says BJP national president JP Nadda pic.twitter.com/PXQCF2daxo
— ANI (@ANI) March 8, 2025
ఢిల్లీలో అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వం శనివారం మంత్రివర్గ సమావేశంలో మహిళా సమృద్ధి యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించినట్లు జేపీ నడ్డా ప్రకటించారు.
#WATCH | Delhi | Union Minister and BJP National President JP Nadda says, “…Today, I am happy, and I congratulate CM Rekha Gupta and others that for Mahila Samriddhi Yojan, they have allocated Rs 5100 crore to implement it in Delhi…” pic.twitter.com/gryn3NDNEX
— ANI (@ANI) March 8, 2025
Also Read..
Ranya Rao | కస్టడీలో ఉన్న నటి రన్యారావు శరీరంపై గాయాలు.. డీఆర్ఐ అధికారులు ఏమన్నారంటే..?
Rahul Gandhi | ఆయన కాంగ్రెస్ నేతగా కాదు.. యూట్యూబర్‌గా వచ్చారు.. రాహుల్ ధారావి పర్యటనపై విమర్శలు