Maharashtra BRS | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో మహిళాలోకం బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నది. నిత్యం వేలమంది బీఆర్ఎస్లో చేరుతూ దేశంలో మార్పుకోసం ముందడుగు వేస్తున్నారు. మహారాష్ట్రలో మహిళా చైతన్యానికి ప్రతీకగా ఉన్న ‘ఛత్రపతి శాసన్ మహిళా అగాడీ’ తాజాగా బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. ఈ సంఘంలో 10 వేల మంది కార్యకర్తలున్నారు. మహారాష్ట్రవ్యాప్తంగా వీరు జిల్లా, తాలుకా, గ్రామస్థాయిలో మహిళాభ్యుదయం కోసం పనిచేస్తున్నారు. ఛత్రపతి శాసన్ మహిళా అగాడీ’ అధ్యక్షురాలు దివ్య మేగ్దుం తన అనుచరులతో కలిసి సోమవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దివ్య మేగ్దుం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ విధానాలను మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి, కేంద్రం లో కిసాన్ సరార్ను అధికారంలోకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు.
వందలమంది సర్పంచుల చేరిక
బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మహారాష్ట్ర పల్లెలు కదిలివస్తున్నాయి. తెలంగాణలో రైతు, దళిత, పేద వర్గాలకు తెలంగాణలో అమలవుతున్న పలు పథకాలు తమకూ అమలు చేయాలన్న బలమైన ఆకాంక్షతో మహారాష్ట్ర సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. సోమవారం వందమందికిపైగా సర్పంచులు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. బుల్దానా జిల్లా అమరావతి డివిజన్‌కు చెందిన పలు గ్రామాలకు చెందిన సర్పంచులు మధూరి యోగశ్ ఫర్ఫత్ (మురాంబా గ్రామం), రమేష్శ్రాంభావు వాఘ్ (గుగ్లి గ్రామం), సచిన్ ప్రభాకర్ మహాజన్ (అంట్రి గ్రామం), జితేంద్ర భగవత్ షిండే (మహాలుంగి), మహాదేవ్ వామన్ తాయ్దే (సరోలా పిర్ గ్రామం), అమోల్ అరున్ ప్రధాన్ (తకీ ఘడేకర్ గ్రామం), ధన్‌రాజ్ మనోజ్ ఖుండ్ (జావ్లా పరస్ ఖేడ్), అంజద్ ఖా అహ్మద్ ఖా పఠాన్ (అంబషి గ్రామం), అనిల్ భగవాన్ బోడేడ్ (గవ్హాన్ గ్రామం), సదానంద్ సారంగధర్ పుండేకర్ (ఏయూల్ఖేడ్ గ్రామం) ఇంకా అనేక మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నాగ్‌పూర్‌కు చెందిన ఆమ్ఆద్మీ పార్టీ సంఘటన్ మంత్రి అనిల్ లిచ్చదే, కాంగ్రెస్ పార్టీ నగర ప్రెసిడెంట్ రమన్ బేలే, ఆర్పీఐ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ బోరర్, శివసేన సెక్రటరీ సరిత కోల్హే, ఆర్పీఐ ఆర్గనైజర్ మహేంద్ర బోర్డే, శివసేన వార్డు ఉపాధ్యక్షుడు అరవింద్ నక్షతే, కాంగ్రెస్ నేత సచివ్ దీపక్ కోల్హే, అమరావతి గ్రామానికి చెందిన బీఎస్పీ వార్డు అధ్యక్షుడు నదేశ్ అంబేదర్, వార్ధాకు చెందిన కాంగ్రెస్ నేత పవన్ తిజారే తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
సైంటిస్టులు, మేధావుల చేరిక
వార్ధా జిల్లా హింగన్ ఘాట్ పట్టణానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఉమేశ్ ఎస్ వావేర్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉమేశ్ సర్పంచ్‌గా సేవలందించడంతోపాటు ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఎన్సీపీకి చెందిన ప్రొఫెసర్ జావిద్ పాషా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. వీరితో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి వేర్వేరు పార్టీలకు చెందిన పలువురునాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.