శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 12:21:48

కొత్త సాగు చ‌ట్టాల‌ను అమ‌లు చేయం : మ‌హారాష్ర్ట స్పీక‌ర్‌

కొత్త సాగు చ‌ట్టాల‌ను అమ‌లు చేయం : మ‌హారాష్ర్ట స్పీక‌ర్‌

ముంబై : మ‌హారాష్ర్ట‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొత్త సాగు చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌మ‌ని ఆ రాష్ర్ట అసెంబ్లీ స్పీక‌ర్ నానా ప‌టోల్ స్ప‌ష్టం చేశారు. రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైలో అన్న‌దాత‌లు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో అత్య‌ధికంగా నాసిక్ జిల్లాకు చెందిన రైతులే ఉన్నారు. గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం స్పీక‌ర్ మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చ‌ట్టాల‌పై రాష్ర్ట ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసి స‌మీక్షిస్తుంద‌ని తెలిపారు. అయితే రాష్ర్టంలో ఈ చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాను కూడా రైతునే కాబ‌ట్టి అన్న‌దాత‌ల నిర‌స‌న‌కు త‌ప్ప‌కుండా మ‌ద్ద‌తు తెలియ‌జేస్తాన‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు. ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌, మ‌హారాష్ర్ట కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాల‌సాహెబ్ థోర‌త్ కూడా రైతుల నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌పై మెమోరాండం ఇచ్చేందుకు స‌మ‌యం కోరితే గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి ఇవ్వ‌లేద‌ని శ‌ర‌ద్ ప‌వార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కంగ‌నా ర‌నౌత్‌కు స‌మ‌యం ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్ రైతుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ రెండు విష‌యాల‌ను స్పీక‌ర్ కూడా ప్ర‌స్తావిస్తూ గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుబ‌ట్టారు. 

VIDEOS

logo