Sanjay Raut | మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వంపై శివసేన (యూటీబీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మహారాష్ట్రకు మూడో డిప్యూటీ సీఎం (third deputy CM) వస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే (Eknath Shinde)కు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. షిండే వర్గానికి చెందిన శివసేన నుంచే కొత్త అభ్యర్థి ఉంటారని పేర్కొన్నారు.
‘ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేకి పెద్దగా ప్రాధాన్యత లేదు. మహారాష్ట్రకు త్వరలోనే మూడో డిప్యూటీ సీఎం వస్తారు. షిండే వర్గానికి చెందిన నేతనే రాష్ట్రానికి మూడో డిప్యూటీ సీఎం అవుతారు’ అని సంజయ్ రౌత్ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శివసేన రెండుగా విడిపోవడంపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. ఈ మేరకు ఏక్నాథ్ షిండేపై సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలకు భయపడి వారు పారిపోయారన్నారు. శివసేన (యూటీబీ) మాత్రం అన్నింటికీ తట్టుకుని బలంగా నిలబడుతోందన్నారు.
#WATCH | Mumbai | Shiv Sena (UBT) MP Sanjay Raut says, “…Maharashtra will get a third deputy CM soon. It will be someone from among them (Shiv Sena- Shinde)…Power comes and goes, but we are strongly standing on our feet here. ” pic.twitter.com/uVfpV8MOcY
— ANI (@ANI) January 24, 2025
Also Read..
Jalgaon train tragedy | చాయ్ వాలా వల్లే ఆ రైలు ప్రమాదం : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
Manish Sisodia | జైల్లో ఉన్నప్పుడు నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు.. బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు
Maha Kumbh | కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు