Jalgaon train tragedy | ముంబై : మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ప్రమాద ఘటనపై నిన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ సవార్ స్పందించారు. చాయ్ వాలా పుకార్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదం సంభవించినట్లు ఆ చాయ్ వాలా ప్రయాణికులకు అవాస్తవం చెప్పడంతో, భయంతో అలారం చైన్ లాగి బయటకు దూకేశారని తెలిపారు.
ఇంతలో అదే ట్రాక్ పైన బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. ట్రాక్‌పైన ఉన్న ప్రయాణికులను ఈ రైలు ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే 13 మంది మృత్యువాత పడ్డారు. ఛిద్రమైన మృతదేహాలు, తెగిపడిన అవయవాలతో ఘటనాస్థలి భీతావహంగా మారిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Crime news | అమానవీయం.. అప్పు చెల్లించలేదని మహిళను తీవ్రంగా కొట్టి.. గుండు గీసి..!
Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం..!
8 Vasantalu Teaser | ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసానే నీకు.. ఫీల్ గుడ్‌గా అనంతిక 8 వసంతాలు టీజర్