8 Vasantalu Teaser | మ్యాడ్ ఫేం అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasantalu). ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనంతిక శుద్ధి అయోధ్య పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే తెలియజేశారు మేకర్స్.
తాజాగా టీజర్ విడుదల చేశారు. ఇట్స్ ఓకే మూవ్ ఆన్ అవ్వాలి రా తప్పదు అని వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ క్యారెక్టర్ అంటుంటే అంత ఈజీ అనుకుంటున్నవా.. ? అసలు ప్రేమ నీ నుండి వెళ్లిపోతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసానే నీకు .. అంటూ చెప్తున్న సంభాషణలతో షురూ అయింది టీజర్. అందమైన లవ్ ట్రాక్, ట్యూన్‌తో ఫీల్ గుడ్‌గా సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చెప్పకనే చెబుతోంది.
మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రయాణం..
ఈ సినిమా కోసం అనంతిక సనిల్ కుమార్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక ఎలా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యిందో తెలియజేసే వీడియో కూడా షేర్ చేసి సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.
అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానిలో ఒక సముద్రమే కనిపిస్తుంది..అంటూ వచ్చే డైలాగ్ సినిమా మహిళా లోకానికి స్ఫూర్తి నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఆవిష్కరించే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ఇప్పటివరకు వచ్చి రషెస్‌తో అర్థమవుతోంది.
ఓ అమ్మాయి తనకున్న బాధల్లోని నుంచి బయటకు వచ్చి మార్షల్ ఆర్ట్స్‌లో ఎలా ప్రావీణ్యం సంపాదించిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
8 వసంతాలు టీజర్..
MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది