Maharashtra | ముంబై : మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నాగపూర్‌కు సమీపంలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదాన్ని భండారా జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే ధృవీకరించారు. ఈ భారీ పేలుడు శబ్దాలు ఐదు కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో పెద్ద ఎత్తున పొగ ఎగిసిపడింది. ఈ దృశ్యాలను దూరాన ఉన్న కొందరు తమ కెమెరాల్లో బంధించారు.
ఇవి కూడా చదవండి..
Bomb Threat | మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్థులు
Manish Sisodia | జైల్లో ఉన్నప్పుడు నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు.. బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు
KTR | అమ్మాయిలకు సాధికారత ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి : కేటీఆర్