Eknath Shinde | మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. బుధవారం థానేలో ఆయన నివాసంలో షిండే మీడియాతో మాట్లాడుతూ.. వాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
పోరాటం తన రక్తంలోనే ఉందని ఏక్నాథ్ షిండే తెలిపారు. మహాయుతి గెలుపు కోసం కార్యకర్తగా పనిచేశానని తెలిపారు. ఒక కార్యకర్తలా చెప్పులు అరిగేలా తిరిగానని పేర్కొన్నారు.తమ పార్టీకి అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్ అఘాడీ కూటమిని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పారు. అందుకే తాను సీఎంగా ఏనాడూ ప్రవర్తించలేదని.. ఒక సామాన్యుడిలాగే ప్రజల్లో తిరిగానని తెలిపారు. తాను సామన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, పేదల కష్టాలు, బాధలన్నీ తెలుసునని అన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశానని పేర్కొన్నారు. బాల్ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
తనకు ప్రధాని మోదీ పూర్తి మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే తెలిపారు. పేరు కోసం పాకులాడటం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు తాను, తన సహచరమంత్రులు 24/7 పనిచేశామని తెలిపారు. ఇక మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలో బీజేపీ హైకమాండ్ నిర్ణయానికే వదిలేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిపై మోదీ, అమిత్షా నిర్ణయమే ఫైనల్ అని.. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
#WATCH | Thane: While speaking about the CM face for Maharashtra, caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, “…A meeting of all three parties (of Mahayuti) will be held with Amit Shah tomorrow (28th November). Detailed discussions will be held in that meeting. After… pic.twitter.com/1mfPokGGB3
— ANI (@ANI) November 27, 2024