ముంబై, జూలై 12: మహారాష్ట్రలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి పోటీ చేసిన తొమ్మిది స్థానాలనూ కైవసం చేసుకుంది. బీజేపీ ఐదు స్థానాలు గెలుచుకోగా, శివసేన(షిండే) రెండు స్థానాలు, ఎన్సీపీ(అజిత్ పవార్) రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఇక, మహావికాస్ అఘాడీ మూడు స్థానాలకు పోటీ చేయగా రెండింటిని గెలుచుకుంది. శివసేన(ఉద్ధవ్) నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు గెలవగా, శరద్ పవార్ మద్దతుతో పోటీ చేసిన పీడబ్ల్యూపీ అభ్యర్థి జయంత్ పాటిల్ ఓడిపోయారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ప్రచారం జరుగుతున్నది.