ముంబై, నవంబర్ 24: కేంద్ర ప్రభుత్వం పంపిన ‘అమెజాన్ పార్సిల్’ మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ అని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. ఛత్రపతి శివాజీ మీద గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.
బీజేపీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే కూడా గవర్నర్‌ను తొలగించాలని ప్రధాని మోదీని కోరారు. గవర్నర్ అన్ని హద్దలూ మీరారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. ఛత్రపతి శివాజీ పాతకాలపు ఐకాన్ అంటూ కోశ్యారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.