Stampede: దీపావళి పండుగ నేపథ్యంలో జనం సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్లకు పోటెత్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దాంతో ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో ఇవాళ ఉదయం భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వందలాది మంది ప్రయాణికులు బాంద్రా టెర్మినస్‌లోని ప్లాట్ ఫామ్ నంబర్ 1 పై వేచిచూస్తుండగా.. బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లాల్సిన నంబర్ 22921 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫామ్ మీదికి వచ్చింది. దాంతో జనం ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ తెల్లవారుజామున 5.56 గంటలకు ఈ విషాద ఘటన సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిది మంది ప్రయాణికులను రైల్వే భద్రత సిబ్బంది, జనరల్ పోలీసులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఒకరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
ప్లాట్ ఫామ్ నంబర్ 1పై ప్రయాణికులు పోటెత్తడం, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అక్కడికి చేరుకోగానే తోపులాట చోటు చేసుకోవడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Maharashtra | Visulas from Bandra Terminus where 9 people have been injured in a stampede due to a rush on platform number 1 of the Terminus Injured passengers have been shifted to a hospital: BMC pic.twitter.com/PccL3kjhp2
— ANI (@ANI) October 27, 2024