మాకు 12 కోట్ల వ్యాక్సిన్లు కావాలి.. టీకా కంపెనీలకు మహారాష్ట్ర లేఖ
వ్యాక్సిన్లు| దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.

ముంబై: దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలో 18 ఏండ్లు నిండినవారు, పైబడినవారు మొత్తం ఐదు కోట్ల మందికి పైగా ఉన్నారని, వీరికోసం తమకు 12 కోట్ల వ్యాక్సిన్లు అవసరమవుతాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోప్ అన్నారు. తమ డిమాండ్‌కు సరిపడా కేటాయించాలని వ్యాక్సిన్ తయారీదారులైన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు లేఖ రాశామని చెప్పారు. ఒకవేల ఆ మొత్తంలో వ్యాక్సిన్ సరఫరా కాకపోతే మే 1 నుంచి టీకా ఎలా పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈమేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు కేటాయించాలని కోరారు.

నేటి నుంచి రిజిస్ట్రేషన్లు..
దేశవ్యాప్తంగా నేటి నుంచి 18 ఏండ్లు పైబడినవారికి టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభకానుంది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు తమ పేర్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అర్హులంతా తమ మొబైల్ నంబర్ ద్వారా కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడినవారి కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్… అయినా పట్టించుకోరా?
మరణాల్లో పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్కు లింక్ లేదు!
రోజువారీ కేసుల్లో 38% ఇండియాలోనే
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా వ్యాక్సిన్ పేటెంట్ తీసెయ్యాలి!
భారత్‌కు అండగా దలైలామా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

