Duty 50% off on Import Scotch | మందు ప్రియులకు శుభవార్త.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్కాచ్ విస్కీపై 50 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గబోతున్నది. అంటే విదేశాల్లో తయారైన స్కాచ్ మందు చౌకగా లభించనున్నది. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇంతకుముందు మహారాష్ట్రలో దిగుమతి చేసుకుంటున్న స్కాచ్ తయారీ ధరపై 300 శాతం ఎక్సైజ్ సుంకం విధించేవారు. ఆ ఎక్సైజ్ సుంకం 50 శాతం అంటే 150 శాతం తగ్గిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్‌శాఖ సీనియర్ అధికారి చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది.
దిగుమతి స్కాచ్ విస్కీపై సుంకం తగ్గించడం వల్ల మద్యం అమ్మకాలు పెరుగుతాయని, రెవెన్యూ మెరుగు పడుతుందని ఉద్ధవ్ సర్కార్ యోచన. ప్రస్తుతం విదేశీ స్కాచ్ విస్కీ విక్రయంతో ప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల ఆదాయం లభిస్తోంది. తాజా నిర్ణయంతో అది రూ.250 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు లక్ష స్కాచ్ విస్కీ బాటిళ్లు అమ్ముడయ్యేవి. కానీ ఇక ముందు 2.5 లక్షల బాటిళ్లకు చేరతాయని భావిస్తున్నారు. దిగుమతి స్కాచ్ విస్కీలపై సుంకాలు తగ్గించడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఆ స్కాచ్ విస్కీ బాటిళ్ల స్మగ్లింగ్ కూడా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?