న్యూఢిల్లీ : 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్ల పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేత్కర్ ఆరోపించారు.
ఆ పార్టీ బుధవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, భారత దేశంలో పరిస్థితులను ప్రభావితం చేయాలని సీఐఏ, మొస్సాద్ నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. స్థిరమైన కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కూటమి అధికారానికి తిరిగి వస్తే, తమ ప్రయోజనాలను కొనసాగించలేమని ఆ సంస్థలు విశ్వసించాయని చెప్పారు.