Maha Kumbh Mela | ప్రయాగ్రాజ్: ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇదే రోజు మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యూపీ సర్కారు మళ్లీ ఆంక్షలు విధించింది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్’గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఉత్తర్వులు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఎంట్రీ పాయింట్ సమీపంలోని స్నాన వాటికల వద్దే భక్తులు పుణ్య స్నానాలు చేయాలని, తాజా గైడ్లైన్స్ పాటించాలని అధికారులు కోరారు. నిత్యావసర సరుకులను తరలించే వాహనాలకు, వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.