చతర్‌పుర్: ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న కుంభమేళా(Maha Kumbh) రైళ్లపై అటాక్ జరిగింది. మధ్యప్రదేశ్‌లోని చతర్‌పుర్ రైల్వే స్టేషన్లో ఆగిన ట్రైన్‌పై ప్రయాణికులు రాళ్లతో దాడి చేశారు. ట్రైన్ లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు తీయడం లేదని.. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న వ్యక్తులు అసహనంతో దాడి చేశారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. చతర్‌పుర్, హర్పల్పుర్ రైల్వే స్టేషన్లలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
డిమాండ్ మేరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు. చతర్‌పుర్, హర్పల్పుర్ స్టేషన్లలో రైలు ఆగిన సమయంలో కొందరు ప్రయాణికులు ఆగ్రహంతో రైలుపై దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత రైల్వే పోలీసు అధికారులు డోర్లు ఓపెన్ చేశారు. కానీ అప్పటికే రైలు కిక్కిరిసిపోవడం వల్ల ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు చాలా మంది రైలు ఎక్కలేకపోయారు.
రైళ్లపై దాడి జరిగిన ఘటన గురించి తమకు సమాచారం అందినట్లు జాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.
BREAKING: Attack on train carrying Hindu devotees from Jhansi to Prayagraj for MahaKumbh 2025
A mob attacked the MahaKumbh special train at Harpalpur station in Jhansi division.#MahaKumbh2025 #Prayagraj #UttarPradesh pic.twitter.com/hYtsWLSMOR
— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 28, 2025