Narhari Zirwal | మహారాష్ట్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ (Maharashtra Deputy Speaker) నరహరి ఝిర్వాల్ (Narhari Zirwal) ఆ రాష్ట్ర సచివాలయంపై నుంచి కిందకు దూకారు. మహారాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయం అయిన మంత్రాలయ బిల్డింగ్ ( Mantralaya building)పై నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దూకేశారు. అయితే, బిల్డింగ్కు సేఫ్టీ నెట్ (Safety Net) ఏర్పాటు చేసి ఉండటంతో ఆయన అందులో పడిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు వెంటనే ఆయనను రక్షించారు.
#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra’s Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16
— ANI (@ANI) October 4, 2024
గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరీలోకి చేరుస్తూ.. షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని గిరిజన ప్రజాప్రతినిధులు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ విషయంలో నిరసన తెలుపుతూ నరహరి ఈ చర్యకు పాల్పడినట్లు సచివాలయం వర్గాలు వెల్లడించాయి.
#Maharastra #Politics #Mumbai #Mantralaya
Adivasi MLAs protesting on protective net in Manatralaya.
They are protesting against Dhangar community getting reservation in ST category. pic.twitter.com/KzpkAMLLdc— Mayuresh Ganapatye (@mayuganapatye) October 4, 2024
Also Read..
Akhil Akkineni | సమాజంలో ఆమె లాంటి వాళ్లకు స్థానం లేదు.. కొండా సురేఖపై మండిపడ్డ అఖిల్ అక్కినేని
MLA Vemula | సోయా పంటకు ప్రభుత్వమే బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే వేముల