నిజామాబాద్ : ఎకరానికి 6 కిలోల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయా పంటను( Soya crop) ఎంఎస్పీ ధరకు అదనంగా రూ.500 బోనస్(Bonus) ఇచ్చి పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula) డిమాండ్ చేశారు. జిల్లాలో మంత్రుల రివ్యూ మీటింగ్ ఉన్న విషయాన్ని ఈ రోజే తెలపడంతో మీటింగ్ వెళ్లలేని పరిస్థితి కల్పించారన్నారు. దీంతో సోయా కొనుగోలు పై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అనుకున్న డిమాండ్ లను మీడియా ద్వారా ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వమే సోయా పంట కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలన్న తన డిమాండ్‌ను గుర్తు చేశారు. తదనంతరం ప్రభుత్వం మొక్కుబడిగా మాత్రమే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిందని విమర్శించారు.
ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం ఎకరానికి 6 క్వింటాళ్ల మట్టుకు మాత్రమే తీసుకుంటామంటుంది. మిగతా పంటను అమ్ముకోవాలంటే రైతులు మళ్లీ ప్రైవేట్ వ్యాపారుల చుట్టూ తిరిగి క్వింటాలుకు 4,300 రూపాయలకే అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో 1,30,000 ఎకరాలలో సోయా పంట పండుతుంది (కామారెడ్డి 90 వేలు,నిజమాబాద్ 40 వేలు ఎకరాలు) మీడియా ద్వారా ప్రభుత్వానికి, జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు డిమాండ్ చేస్తున్న ..ఎకరానికి 6 కిలోల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయాపంటను కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా MSP ధర కంటే అదనంగా 500 బోనస్ ఇచ్చి క్వింటాలుకు 5,392 రూపాయలు చెల్లించాలి. లేదంటే రైతుల పక్షాన BRS పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.