చెన్నై: తమిళనాడులోని తేని నియోజకవర్గం ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ పార్లమెంటరీ స్థానం వెంటనే ఖాళీ అయినట్టు ప్రకటించింది.
రవీంద్రనాథ్ తన, తన కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా దాచి పెట్టారని తేనికి చెందిన పీ మలనీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన ధర్మాసనం..ఆస్తుల వివరాలు దాచిపెట్టారన్న విషయం నిరూపితమైందని.. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది.