Sand Mafia | మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి అధికారి హత్య
Sand Mafia | ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
భోపాల్: ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోపాల్పూర్ ప్రాంతంలోని సోన్ నది సమీపంలో అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో శనివారం అర్ధరాత్రి వేళ ప్రసన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది.
కాగా, ఒక ట్రాలీలో ఇసుకను అక్రమంగా అక్కడి నుంచి తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు అధికారి ప్రసన్ సింగ్ ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ ఆ అధికారి మీదుగా ట్రాక్టర్‌ను నడిపి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సింగ్ అక్కడికక్కడే మరణించాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రెవెన్యూ శాఖ అధికారి ప్రసన్ సింగ్‌ను ట్రాక్టర్‌తో తొక్కి హత్య చేసిన డ్రైవర్‌ను 25 ఏళ్ల శుభం విశ్వకర్మగా గుర్తించారు. ఆదివారం ఉదయం అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ట్రాక్టర్ యజమానిని కూడా గుర్తించినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

