భోపాల్ : లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా ప్రజలకు చేరువ కావాల్సిన సమయంలో కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఝలక్ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఛింద్వారా మేయర్ విక్రమ్ అహకే సోమవారం బీజేపీలో చేరారు. ఛింద్వారా కాంగ్రెస్ దిగ్గజాల్లో ఒకరైన కమల్నాథ్ సొంత జిల్లా కావడంతోపాటు, 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. అటువంటి ఛింద్వారాలో ఈ పరిణామం జరగడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. విక్రమ్ సోమవారం భోపాల్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే, కమల్నాథ్ సన్నిహితుడు, ఛింద్వారా జిల్లా, అమరవాడ ఎమ్మెల్యే కమలేశ్ షా గతవారం బీజేపీలో చేరారు.