భోపాల్, ఆగస్టు 31: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. శివపురి జిల్లా కొలారస్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేంద్ర రఘువంశి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వెళ్తున్నానని, సింధియా ఆదేశాలతో అవినీతి అధికారులను కొలారస్, శివపురిలో నియమిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గుణ ఎంపీ బీజేపీలో చేరిన నాటి నుంచి తనను పక్కనపెట్టారని, తన మద్దతుదారులను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.