భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ సోమవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ జాబితాలో ఉన్నారు.
అలాగే ఎంపీలు ఉదయ్ ప్రతాప్ సింగ్, రితి పాఠక్, గణేశ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా ప్రకటించలేదు.