Goa Nightclub Fire | గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 11న థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు దర్యాప్తు బృందం ప్రయత్నిస్తోంది.
రేపు ఉదయం వీరిని న్యూఢిల్లీకి తీసుకురానున్నట్లు తాజాగా తెలిసింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే.. లూత్రా బ్రదర్స్ (Luthra Brothers)ను గోవా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు సంబంధిత అధికారులు తాజాగా తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం గోవాకు తరలించనున్నారు.
ఈనెల 6వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత గోవాలోని అర్పోరాలోని క్లబ్, బిర్చ్ బై రోమియో లేన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత కొన్ని గంటలకు లూత్రా సోదరులు ఇండిగో విమానంలో థాయ్‌లాండ్‌కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్‌పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు.
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100కుపైగా విమానాలు రద్దు
Sabarimala | శబరిమలకు రికార్డు స్థాయిలో భక్తులు.. 25 లక్షలు దాటిన సంఖ్య