లక్నో : దశాబ్ధాలుగా సంప్రదాయ భారత రుచులు ప్రపంచాన్ని అలరిస్తున్నాయి. దేశీ వంటకాల రుచులు ఖండాంతరాల్లో ఆదరణ పొందుతూ మన ఘుమఘుమలనూ విదేశాలకూ వ్యాప్తి చేస్తున్నాయి. భారత్‌లో జపాన్ రాయబారి హిరోషి సుజుకి సైతం మన వంటకాలను ఇష్టంగా ఆరగిస్తుంటారు. భారత వంటకాల్లో భిన్నత్వాన్ని హైలైట్ చేస్తూ ఆయన పలు దేశీ రుచులను ఆస్వాదించే పోస్టులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.
ఇక లేటెస్ట్గా ఆయన లక్నో సందర్శించారు. లక్నో పర్యటనలో భాగంగా అంబాసిడర్ లక్నో బిర్యానీని ఎంజాయ్ చేశారు. వరుసగా రెండు రోజులు లక్నో బిర్యానీతో విందు సాగిందని తాను తిన్న బెస్ట్ బిర్యానీ ఇదేనని ఆయన తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. తన లక్నో పర్యటనకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు.
లక్నోలోని బారా ఇమాంబర అద్భుత ఆర్కిటెక్చర్ ఎంతగానో ఆకట్టుకుందని రాసుకొచ్చారు. లక్నో బిర్యానీని టేస్ట్ చేయకముందు ఆయన గతంలో ఢిల్లీలోని సరోజిని నగర్లో దేశీ వంటకాలను ట్రై చేశారు. రజనీకాంత్ అభిమాని కూడా అయిన అంబాసిడర్ జైలర్ మూవీలోని కావాలా సాంగ్‌కు తాను డ్యాన్స్ చేసిన వీడియోను కూడా షేర్ చేశారు.
Read More :
Delhi | ఢిల్లీలో మరో ఐదు రోజులు స్కూల్స్ బంద్..