లక్నో: సైబర్ నేరగాళ్లు తాము సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్ చేసి లక్నోకు చెందిన ప్రముఖ కవి, ప్రగతిశీల రచయిత నరేశ్ సక్సేనాను ఆరు గంటలపాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. కొన్ని గంటలపాటు ఆయన గది నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యుల జోక్యంతో సైబర్ నేరాగాళ్ల పాచిక పారకుండా పోయింది. జూలై 7న మధ్యా హ్నం 3 గంటల సమయంలో జరిగిందీ ఘటన. కవి సమ్మేళనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సక్సేనాకు వీడియో కాల్ చేసిన నేరగాడు తనను తాను సీబీఐ ఇన్స్పెక్టర్ రోహన్శర్మగా పరిచయం చేసుకుని మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని హెచ్చరించాడు. ఆ తర్వాత రచయిత బ్యాంకు ఖాతా, లావాదేవీలు ఇతర వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత సీబీఐ చీఫ్ పేరుతో మరో వ్యక్తి లైన్లోకి వచ్చాడు. అయితే, చాలాసేపటి నుంచి సక్సేనా తలుపులు తెరవకపోడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఆయన గదిలోకి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదుచేశారు.