లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీతోపాటు చిన్నచితకా పార్టీలన్నీ పోటీకి ఉవ్విళ్లూరుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. యూపీలో తమ పార్టీ మొత్తం 100 స్థానాల్లో పోటీ చేస్తుందని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఓవైసీ ప్రకటించారు.
అయితే, ఈ ఎన్నికల్లో తాము ఒంటిరిగా పోటీ చేస్తామా..? లేదంటే ఏ పార్టీతోనైనా కలిసి కూటమిగా బరిలో దిగుతామా..? అనేది కాలమే నిర్ణయిస్తుందని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. పొత్తుల విషయమై తాము కొన్ని పార్టీలతో అయితే సంప్రతింపులు జరుపుతున్నామని తెలిపారు. చాలా అసెంబ్లీ స్థానాల్లో తాము గెలిచే స్థాయిలోనే ఉన్నామని పేర్కొన్నారు.