Bomb Threat | విమానాలకు బాంబు బెదిరింపు (Bomb Threat)లతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. ఆదివారం తిరుపతి, రాజ్‌కోట్, కోల్‌కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా లక్నో (Lucknow)లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
హజ్రత్‌గంజ్ ప్రాంతం (Hazratganj area)లో ఉన్న తాజ్ హెటల్ (Taj Hotel)కు సోమవారం ఉదయం ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు హోటల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు అందులో పేర్కొన్నారు. అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసు అధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
కోల్‌కతాలోని 10 ప్రముఖ హోటళ్లకు, రాజ్‌కోట్‌లో 10 హోటళ్లకు, లక్నోలో 10 ప్రధాన హోటళ్లకు ఆదివారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న మూడు హోటళ్లకు శుక్ర, శనివారాల్లో నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. హోటళ్లకే కాదు దాదాపు 50 విమానాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. గడచిన 14 రోజుల్లో 350కిపైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి.
Also Read..
Gaganyaan Mission | 2025లో కాదు.. గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో కీలక అప్డేట్
Delimitation | జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన.. అలా అయితే దక్షిణాదికి తీరని నష్టమే..!
Bomb Threats | వరుస బాంబు బెదిరింపులతో అప్రమత్తం.. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంపు