వాణిజ్య సిలిండర్‌పై రూ.8 పెంపు
న్యూఢిల్లీ, మే 19: వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహావసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర గురువారం రూ.3.5 పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధర రూ.8 పెరిగింది. గ్యాస్ ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండో సారి.
డొమెస్టిక్ సిలిండర్‌పై ఈ నెల 7న రూ.50 పెంచారు. కమర్షియల్ సిలిండర్‌పై ఈ నెల 1న రూ.102.50 పెంచారు. డొమెస్టిక్ సిలిండర్ ధర అన్ని రాష్ర్టాల్లో రూ.1000 మార్కును దాటింది. కిందటేడాది ఏప్రిల్ నుంచి సిలిండర్‌పై మొత్తంగా రూ.193.5 పెరిగింది.