Lpg Cylinder Price Hike | న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. కమర్షియల్ సిలిండర్‌పై రూ.16.50 పెంచుతూ చమురు సంస్థలు ఆదివారం నిర్ణయించాయి. దీంతో హైదరాబాద్‌లో దీని ధర రూ.2066కి చేరింది. ఈ సిలిండర్ ధర పెరగడం వరుసగా ఇది ఐదో నెల. మొత్తంగా ఈ అయిదు నెలల్లో ఈ సిలిండర్ ధర రూ.172.50 పెరిగింది.
ఒక ఏడాది కాలంలో సిలిండర్ ధరలు ప్రస్తుతం అత్యధిక స్థాయికి చేరాయి. మరోవైపు, విమాన ఇంధనం ధర కిలో లీటర్‌కు రూ.1318.12 (1.45 శాతం) పెరిగింది. దేశ రాజధానిలో ప్రస్తుతం ఈ ఇంధనం ధర రూ.91,856.84కు చేరుకుంది. ఈ ఇంధనం ధర వరుసగా రెండో నెల పెరిగింది. ఇండ్లలో వాడే వంటగ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.