Farooq Abdullah | రాముడు హిందువులకే కాదు, ప్రపంచం మొత్తానికి చెందినవాడు: ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah | రాముడు కేవలం హిందువులకే కాదని, ప్రపంచం మొత్తానికి చెందినవాడని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరినీ ఆయన అభినందించారు.
శ్రీనగర్: రాముడు కేవలం హిందువులకే కాదని, ప్రపంచం మొత్తానికి చెందినవాడని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరినీ ఆయన అభినందించారు. శనివారం ఏఎన్ఐ వార్తా సంస్థతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమైందని, దీని నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు చెబుతున్నానని అన్నారు. ‘రాముడు కేవలం హిందువులకు మాత్రమే చెందినవాడు కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆయన చెందినవాడని నేను యావత్ జాతికి చెప్పాలనుకుంటున్నా. ప్రపంచంలోని ప్రజలందరికీ ఆయన ప్రభువు. ఇది పుస్తకాలలో రాసి ఉంది’ అని తెలిపారు.
కాగా, సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకునే సందేశాన్ని శ్రీరాముడు ఇచ్చారని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ‘ఆయన (రాముడు) సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు. మతం లేదా జాతితో సంబంధం లేకుండా అణగారిన ప్రజలను ఉద్ధరించాలని విశ్వవ్యాప్తంగా సందేశాన్ని ఇచ్చారు. ఈ ఆలయం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో క్షీణిస్తున్న సోదరభావాన్ని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నేను దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. ఆ సోదరభావాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్కరికీ నేను చెబుతున్నా’ అని అన్నారు.
#WATCH | Poonch, J&K: Former CM of Jammu and Kashmir and National Conference leader Farooq Abdullah says, “Ayodhya Ram Temple is about to be inaugurated. I would like to congratulate everyone who made the effort for the temple. It’s ready now. I would like to tell everyone that… pic.twitter.com/V7Pb5Q8uN1
— ANI (@ANI) December 30, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

