పూరీ : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథుడి నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ 12వ శతాబ్దపు మందిరం దగ్గర నుంచి 2.6 కి.మీ దూరంలో ఉన్న శ్రీ గుడించా ఆలయం వైపు వెళ్లే రోడ్డుపై జగన్నాథుడు, అతడి తోబుట్టువుల రథాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ క్రమంలో 500 మంది భక్తులు గాయపడ్డారు.ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ విచ్చేసి జగన్నాథునితో పాటు దేవీ సుభద్ర, బలభద్రుని రథం లాగారు.
గుజరాత్లోని అహ్మదాబద్లో జరిగిన జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి చేటుచేసుకుంది. ఉత్సవంలో పాల్గొన్న ఏనుగులు అదుపు తప్పడంతో భక్తులు భయభ్రాంతులయ్యారు. అయితే అదుపుతప్పిన ఏనుగులను అటవీ శాఖ అధికారులు, డాక్టర్ల సహాయంతో కొద్ది సేపటికే దారిలోకి తెచ్చారు. తర్వాత పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.