ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథుడి నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
పూరీ ఆలయంలో ఎన్నో విశేషాలు. ఇక్కడ స్వామి కొయ్యతో కొలువుదీరడం ఆశ్చర్యం. భక్తులను స్వయంగా వచ్చి అనుగ్రహించడం మరో అద్భుతం. పైగా సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఊరేగింపు కోసం ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగిస్త�