ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర.. వీడియో
Puri Jagannath Rath Yatra: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా కొనసాగుతున్నది. కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా గత ఏడాది మాదిరిగానే

భువనేశ్వర్: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా కొనసాగుతున్నది. కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం భక్తులను అనుమతించకపోయినా.. పూరీ రాజు, వేది పండితులు, ఆలయ అర్చకులు, సిబ్బంది కలిసి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ శుక్ల విదియ నాడు అంటే ఇవాళ.. వేద పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి ‘మనిమా’ (జగన్నాథా) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఉత్సవమూర్తులను కదిలించడం ద్వారా రథయాత్రా పర్వం మొదలైంది.
అనంతరం ఉత్సవమూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేశారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అంటారు. ఆ తర్వాత గుండిచా ఆలయానికి వెళ్లేందుకు ఉత్సవమూర్తులు రథంపై సిద్ధమై ఉండగా.. ‘ఇలపై నడిచే విష్ణువు’గా గౌరవాభిమానాలను అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన పరమాత్ముడి ముందు సేవకుడిగా మారి బంగారు చీపురుతో రథాలను ఊడ్చాడు. దీన్నే ‘చెరా పహారా’ అంటారు.
మహారాజు బంగారు చీపురుతో రథాలను ఊడ్చిన అనంతరం రథయాత్ర మొదలైంది. పూరీ ఆలయంలో జరిగిన ఈ సంప్రదాయ కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH Jagannath Rath Yatra gets underway in Puri, Odisha; The erstwhile king of Puri takes part in the Yatra rituals pic.twitter.com/qMzBjMtyny
— ANI (@ANI) July 12, 2021
#WATCH Lord Balbhadra's chariot, Taladhwaja, being pulled by servitors during Rath Yatra in Puri, Odisha . The Yatra is being held without devotees due to COVI19.#RathYatra pic.twitter.com/xY0lhb8rHw
— ANI (@ANI) July 12, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

