ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 28, 2021 , 19:54:02

ట్రాక్టర్‌ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్‌ అవుట్‌ నోటీసులు

ట్రాక్టర్‌ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్‌ అవుట్‌ నోటీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా రైతుల ట్రాక్టర్‌ ర్యాలీలో జరిగిన హింస్మాత్మక సంఘటనలకు సంబంధించి ఢిల్లీ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లలో 33 ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వాటిలో  తొమ్మిది కేసులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ కేసులకు సంబంధించి రైతు నాయకులతో సహా 44 మందిపై లుక్ అవుట్  నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. 

ట్రాక్టర్‌ ర్యాలీకి రైతు సంఘాల నాయకులు, పోలీసుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేయడానికి ముందస్తుగా,  సమన్వయంతో కూడిన ప్రణాళిక ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దురదృష్టకర సంఘటనల వెనుక ఉన్న పెద్ద కుట్ర, నేరపూరిత వ్యూహాంపై స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తుందని చెప్పారు.

దేశద్రోహానికి వర్తించే ఐపీసీ సెక్షన్లతోపాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ పోలీసులు వివరించారు. దేశంలోని, దేశం వెలుపల ఉన్న సంస్థలు, వ్యక్తుల పాత్రపైనా దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

తాజావార్తలు


logo