Truck Drivers | కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ (hit-and-run) కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు (Truck Drivers) చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. భారతీయ న్యాయ సంహిత-2023 క్రిమినల్ కోడ్ చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ నేరానికి గరిష్ఠంగా పదేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేదా శిక్షను తగ్గించాలని దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి మూడు రోజులు ధర్నా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ ధర్నా మంగళవారం కూడా కొనసాగుతోంది. వేల సంఖ్యలో ట్రక్కు డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో ప్రజలు పెట్రోల్ బంక్ల (petrol pumps)కు పోటెత్తుతున్నారు.
#WATCH | Himachal Pradesh: Long queues at petrol pumps in Dharamshala as Transport Association, drivers protest against new law on hit and run cases. pic.twitter.com/OWHvqXrTwS
— ANI (@ANI) January 2, 2024
మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జమ్మూకశ్మీర్, లడఖ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. దీంతో ఆయా బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు (Long queues) దర్శనమిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Maharashtra: Long queues at petrol pumps in Nagpur as Transport Association, drivers protest against new law on hit and run cases. pic.twitter.com/FWgQd1F5iH
— ANI (@ANI) January 2, 2024
#WATCH | Nagpur, Maharashtra: People crowd up fuel pumps to fill up their vehicle tanks fearing a shortage of fuel as truck drivers protest against the hit-and-run law. pic.twitter.com/BA8r5aBYWt
— ANI (@ANI) January 1, 2024
Also Read..
Coronavirus | దేశంలో 4,565కి పెరిగిన క్రియాశీల కేసులు.. కొత్తగా 573 మందికి కొవిడ్ పాజిటివ్
Jr NTR | జపాన్ భూకంపం ఘటనపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. గత వారం అక్కడే ఉన్నా అంటూ ట్వీట్
Japan Earthquake | 30కి చేరిన జపాన్ భూకంపం మృతుల సంఖ్య.. ఇషికావా నగరంలోనే అత్యధికం