Coronavirus | భారత్లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 500కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 573 కరోనా కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,565కి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యాయి. హర్యాణాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,366కి పెరిగింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,76,550గా ఉంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. సోమవారం వరకూ దేశంలో 196 జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో 83, గోవా (51), గుజరాత్ (34), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1), ఢిల్లీ (1) ఉన్నాయి.
Also Read..
Japan Earthquake | 30కి చేరిన జపాన్ భూకంపం మృతుల సంఖ్య.. ఇషికావా నగరంలోనే అత్యధికం
Jr NTR | జపాన్ భూకంపం ఘటనపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. గత వారం అక్కడే ఉన్నా అంటూ ట్వీట్
South Korea | దక్షిణ కొరియా విపక్ష నేతపై కత్తితో దాడి.. తెగిన మెడ