Dementia | న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తులు, సామాజిక సంబంధాలు సరిగాలేక తీవ్రమైన అసంతృప్తితో బతికేవాళ్లు ‘డిమెన్షియా’ (చిత్త భ్రంశం) బారినపడే ముప్పు 30 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి తేల్చింది. వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది పాల్గొన్న 21 దీర్ఘకాలిక అధ్యయనాల్లోని సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు. సామాజిక సంబంధాలు సరిగాలేకపోవటం, ఒంటరితనం.. రెండూ ‘డిమెన్షియా’తో సంబంధమున్నవేనని, దీంతో సదరు వ్యక్తి ఆలోచన, జ్ఞాపక శక్తి, నిర్ణయాలు తీసుకోవటం వంటివి ప్రభావితమవుతాయని నివేదిక పేర్కొన్నది.