Anjali Birla | ఐఆర్పీఎస్ అధికారిణి, లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా (Anjali Birla) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో పరువు నష్టం దావా (Defamation Suit) వేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చేసిన సోషల్ మీడియా పోస్టులను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కాగా, వృత్తిరీత్యా మోడల్ అయిన అంజలి బిర్లా 2019లో యూపీఎస్సీ పరీక్షలు రాశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత 2021లో కమిషన్లో చేరారు. అయితే, ఇటీవలే నీట్ – యూజీ పేపర్ లీక్ అంశం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీంతో అంజలి వివాదం తెరపైకి వచ్చింది. తన తండ్రి ప్రభావంతోనే అంజలి తొలి ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే, ఈ వాదనలను అంజలి కొట్టిపారేశారు. కొందరు సోషల్ మీడియా వేదికగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు, తన తండ్రి పరువుకు నష్టం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు 16 ఎక్స్ ఖాతాల వివరాలను తన పిటిషన్లో పొందుపరిచి కోర్టుకు అందజేశారు. ఆ ఖాతాల్లో తనపై వచ్చిన పోస్టులను తొలగించాలని కోరారు. ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు. అంజలి పిటిషన్ను విచారణకు హైకోర్టు స్వీకరించింది.
Anjali Birla, who is an IRPS officer and the daughter of Lok Sabha Speaker Om Birla, has filed a defamation suit in the Delhi High Court.
She seeks the removal of social media posts that falsely allege she passed UPSC exams on her first attempt due to her father’s influence.…
— ANI (@ANI) July 23, 2024
Also Read..
9 Priorities Of Budget | తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన : నిర్మలా సీతారామన్
Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Union Budget | కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయం