Nari Nari Naduma Murari | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి Sharwa 37. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari) టైటిల్‌తో సందడి చేయబోతుంది. ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ మూవీలో టాలీవుడ్ క్రేజీ యాక్టర్ శ్రీవిష్ణు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు శ్రీవిష్ణు పాత్రకు సంబంధించిన ఆసక్తికర వార్త సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇందులో శ్రీవిష్ణు పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. శ్రీవిష్ణు కాంబోలో వచ్చే సీన్లు చాలా నవ్వు తెప్పిస్తాయి. పెద్ద స్టార్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టుగా ఉండదు. ప్రతీ రోజు నిరంతరాయంగా వినోదాన్నిఅందించే వ్యక్తిగా కనిపిస్తాడు.
మొదటి నుంచి చివరి వరకు థియేటర్లలోని సీట్లలో కూర్చున్నంతసేపు ప్రేక్షకులను నవ్వించేలా సినిమాను తెరకెక్కించాం. మేం బాలకృష్ణ చేతుల మీదుగా టైటిల్ లుక్‌ను ఆవిష్కరించాం. బాలకృష్ణ నారి నారి నడుమ మురారి ఒరిజినల్ సాంగ్‌ను పూర్తిగా వాడకుండా.. అందులోని కొన్ని ఐకానిక్ పదాలను వినియోగించామన్నారు.
ఇప్పటికే సంయుక్తా మీనన్ దియా పాత్రలో నటిస్తుండగా..ఈ భామ సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు భామలు అరుస్తుంటే.. శర్వానంద్ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకోవడం ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు. ఇరువురు భామల కౌగిలిలో స్వామి , ఇరుకున పడి నీవు నలిగితివా అంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36లో కూడా నటిస్తున్నాడు. బైకర్ టైటిల్‌తో వస్తోన్న మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది అంటూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.