Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Union Budget 2025 | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు (Union Budget Highlights) ఏంటో ఇప్పుడు చూద్దాం..
Union Budget 2025 | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
పార్లమెంట్లో బడ్జెట్ ప్రశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా ఆరోసారి కావడం విశేషం. ఇక ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. అయితే, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపించింది. మరి ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు (Union Budget Highlights) ఏంటో ఇప్పుడు చూద్దాం..
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన.
- వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన – నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన – ఆవిష్కరణలు, తయారీ – సేవలు, తర్వాతతరం సంస్కరణలు.. ఈ తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన.
- 2024 – 25 బడ్జెట్ అంచనాలు రూ.48.21 లక్షల కోట్లు.
- జీడీపీలో 4.9 శాతంగా ఉండనున్న ద్రవ్యలోటు.
- వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సుస్థిరత సాధన లక్ష్యంగా చర్యలు.
- ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యం.
- కూరగాయల ఉత్పత్తికి త్వరలో మెగా క్లస్టర్ల ఏర్పాటు. పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధనకు చర్యలు.
- సహకార రంగాన్ని సుస్థిరం చేసేందుకు నిర్మాణాత్మక విధానాల రూకపల్పన.
- వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్ల ఏర్పాటు. సేకరణ, సరఫరా, నిల్వకు అవసరమైన పెట్టుబడులను అందుబాటులోకి తేవడం లక్ష్యం.
- దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాలు
వచ్చే ఐదేండ్లలో నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు. - కొత్త ఉద్యోగాల కల్పనలో తొలి నెల వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపుల్లో నాలుగేండ్ల పాటు ప్రోత్సాహకాలు.
- ఎంప్లాయిమెంట్ ఇన్సెంటివ్‌ల కోసం మూడు పథకాలు.
- అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయం.. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు
- పోలవరానికి పెద్దపీట.. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి.
- రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
- విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు.
- బీహార్ రాష్ట్రానికి ఆర్థిక సాయం. బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా ఆర్థిక సాయం. బీహార్‌లో వంతెనల నిర్మాణానికి రూ.26 వేల కోట్లు.
- వరద నివారణకు బీహార్‌కు రూ.11 వేల కోట్లు.
- బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేవాలయ సాంస్కృతిక పరిరక్షణకు చర్యలు.
- గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్ల కేటాయింపు.
- ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.
- 500 పెద్ద కంపెనీల్లో కోటి మందికి ఉద్యోగ కల్పన.
- వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు.
- 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు.
- పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం.
- పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం.
- రాష్ట్రాల మౌలిక వసతుల కల్పనకు రూ.1.5 లక్షల కోట్ల వడ్డీలేని రుణాలు.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇండ్ల నిర్మాణం.
- అప్ షోర్ మైనింగ్ కోసం కొత్త విధానం.
- దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలు. కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరల పెంపు.
- వాతావరణ మార్పులకు అనుగుణంగా కొత్తగా తొమ్మిది వంగడాల తయారీ. వేరు శనగ, పొద్దు తిరుగుడు పువ్వుల ఉత్పత్తి పెంపునకు చర్యలు.
- స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు.
- మినరల్ మిషన్ ద్వారా ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రత్యేక విధానం.
- సాగర గర్భంలో ఖనిజాల అన్వేషణకు కొత్త ప్రణాళిక.
- 3.1 శాతానికి పరిమితమైన ఆహార, ఆహారేతర ద్రవ్యోల్బణం.
- పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునళ్లు.
- రుణ వసూళ్లకు ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఏర్పాటు.
- మహానగరాల పునర్ నిర్మాణానికి కొత్త ప్రణాళిక.
- మహానగరాలకు అనుబంధంగా హరిత నగరాల ఏర్పాటు.
- నగర వ్యర్ధ జలాల శుద్ధితో వ్యవసాయ అవసరాలకు నీరు.
- నాలుగు శాతానికి ద్రవ్యోల్బణాన్ని పరిమితం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
- ఇప్పటికే విస్తరించిన నగరాల అభివృద్ధికి సృజనాత్మక ప్రణాళిక.
- పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద కోటి మందికి లబ్ధి. రూ. 10 లక్షల కోట్ల నిధులు
మహిళలు, బాలికల సాధికారత కోసం రూ.3 లక్షల కోట్లు. - పట్టణ, నగరాల్లో పేద, మధ్య తరగతి ఇండ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు.
- అసోంలో వరదల నియంత్రణ కొత్త పథకాలకు కేంద్రం ఆమోదం.
- GST కారణంగా సామాన్యులపై పన్నుల భారం తగ్గింది.
- మరింత సరళంగా, హేతుబద్ధంగా GST మార్పు.
- 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు.
- 3 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
- ఎక్స్‌రే మెషీన్లపై జీఎస్టీ తగ్గింపు.
- సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు.
- మొబైల్స్, మొబైల్స్ పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు.
- బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
- లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు.
Also Read..
Nirmala Sitharaman: కొత్త ఉద్యోగులకు నెల జీతం అదనం.. ప్రకటించిన ఆర్థిక మంత్రి సీతారామన్
Union Budget | పీఎం ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం : ఆర్థిక మంత్రి
Union Budget | కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు.. ద్రవ్యలోటు అంచనా 4.9 శాతం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

