న్యూఢిల్లీ: మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటు ఉభయసభల్లో రభస కొనసాగుతున్నది. జాతుల మధ్య పోరాటంతో అట్టుకుడుతున్న మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని, ఉభయసభల్లో ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. దాంతో లోక్‌సభలో, రాజ్యసభలో గందరగోళం నెలకొంది.
తీవ్ర గందరగోళం నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ప్రతిపక్షాల నినాదాలతో సభ కంట్రోల్ తప్పడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభలో పెద్దగా మార్పేమీ లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదాపడింది.
ఇక రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మణిపూర్ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించడంతో సభను ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు సభా నియమావళిని ఉల్లంఘించాడంటూ ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ వర్షాకాల సమావేశం నుంచి సస్పెండ్ చేశారు.
Opposition MPs are meeting with Rajya Sabha Chairman over the suspension of AAP MP Sanjay Singh for the current Monsoon session https://t.co/nrDSgN6YOj
— ANI (@ANI) July 24, 2023