న్యూఢిల్లీ : ఆపరేషన్ సింధూర్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై చర్చ మొదలుపెట్టారు. ఆ తర్వాత అన్ని పార్టీలకు చెందిన నేతలు ప్రసంగిస్తున్నారు. అయితే ఇవాళ రాత్రి 12 గంటల వరకు ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ జరగనున్నది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు లోక్‌సభ రాజ్యసభలకు 16 గంటల సమయాన్ని కేటాయించారు. రాజ్యసభలో మంగళవారం రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. లోక్‌సభలో మంగళవారం అమిత్ షా తొలుత ప్రసంగించనున్నారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు ప్రధాని మోదీ .. ఆపరేషన్ సింధూర్ చర్చపై ప్రసంగిచనున్నారు.
భారతీయ సైనిక బలగాలను కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర హూడా మెచ్చుకున్నారు. సైనిక బలగాల సత్తా గురించి చర్చించడం లేదని, కానీ అధికారంలో ఉన్న నేతలు వాళ్ల కర్తవ్యాన్ని నిర్వర్తించారా లేదా అన్న అంశంపై చర్చిస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత విపక్షాలు ప్రభుత్వానికి అండగా నిలిచాయని, కానీ ప్రధాని మోదీ మాత్రం ఆల్ పార్టీ మీటింగ్‌లకు హాజరుకాలేదన్నారు.