Lok Sabha Elections : లోక్‌సభ ఐదో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 49 లోక్‌సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. రాష్ట్రాల వారీగా చూస్తే లఢక్‌లో అత్యధికంగా 61.26 శాతం పోలింగ్ నమోదైంది.
ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో 60.72 శాతం, జార్ఖండ్‌లో 53.90 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 47.55 శాతం, ఒడిశాలో 48.95 శాతం, జమ్ముకశ్మీర్‌లో 44.90 శాతం, బీహార్‌లో 45.33, మహారాష్ట్రలో 38.77 శాతం పోలింగ్ రికార్డయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుండగా.. ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా 40 శాతానికి మించలేదు.
ముంబై నార్త్ లోక్‌సభ స్థానంలో 39.33 శాతం, ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ స్థానంలో 37.66 శాతం, ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ స్థానంలో 39.15 శాతం, ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానంలో 39.91 శాతం, ముంబై సౌత్ లోక్‌సభ స్థానంలో అత్యల్పంగా 36.64 శాతం, ముంబై సౌత్ సెంట్రల్ లోక్‌సభ స్థానంలో 38.77 శాతం పోలింగ్ నమోదైంది.